కొత్త దంపతులు పెళ్ళయిన మరుక్షణం నుంచే పిల్లన్నికనే పనిలో ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. సోమవారం నాగపట్టణం జిల్లా పర్యటనలోఉన్న ఆయన ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.
కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సిద్ధమవుతుందని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజిస్తే రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్య తగ్గుతాయని.. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేందుకు కొత్త జంటలు త్వరగా పిల్లలు కనాలని కోరారు. మనం జనభా పెంచుకోకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, కొత్తగా పుట్టే పిల్లలకు కేవలం తమిళంలోనే పేర్లు పెట్టాలని, తద్వారా సెమ్మొళి తమిళంకు మరింత గౌరవం చేకూర్చినట్టు అవుతుందన్నారు.
ఇదే సందర్భంలో ఆయన గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కొత్త జంటలు పిల్లలు కనేందుకు సమయం తీసుకోవాలని గతంలో తాను చెప్పానని, ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయం మార్చుకుంటున్నట్టు తెలిపారు.