ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా 128 ఖాళీలను భర్తీ చేయబోతోంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఉద్యోగాలు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుంటున్నారు. అయితే వీలును బట్టి పర్మినెంట్ చేసే అవకాశం ఉంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 128
పోస్టుల వివరాలు:
1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ): 09 పోస్టులు
2. కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్): 115 పోస్టులు
3. కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్): 04 పోస్టులు
అర్హత:
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతితో పాటు పారా వెటర్నరీ కోర్సు లేదా డిప్లొమా లేదా వెటర్నరీ సర్టిఫికేట్ కోర్సు ఉత్తీర్ణత. కానిస్టేబుల్ పోస్టులకు మెట్రిక్యులేషన్/ 10వ తరగతి.
నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా అనుసరించాలి.
వయసు: 10-09-2024 నాటికి
- హెడ్ కానిస్టేబుల్/ కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య
- కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్‌పోర్ట్) పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య
జీతం:
- హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100
- కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700-రూ.69,100
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10-09-2024
వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/rect/statics/news
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి