NCERT లో 123 టీచింగ్ పోస్టుల భర్తీ ప్రకటన… పూర్తి వివరాలివిగో…

నేషనల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ), న్యూఢిల్లీ వారు దేశవ్యాప్తంగా గల వివిధ కేంద్రాలలో (అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూరు మరియు షిల్లాంగ్) డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో 123 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటిలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్/అసిస్టెంట్‌ లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి.

NCERT Jobs
NCERT Jobs

వివరాల్లోకి వెళ్తే ..

ప్రకటన నం. 174/2024

మొత్తం పోస్టుల సంఖ్య:  123
పోస్టుల వివరాలు:

  • ప్రొఫెసర్- 33
  • అసోసియేట్‌ ప్రొఫెసర్- 58
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్/అసిస్టెంట్‌ లైబ్రేరియన్- 32

విభాగాలు :  హిస్టరీ, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్‌, ఉర్దూ, జాగ్రఫీ, సైకాలజీ, సివిల్ ఇంజినీరింగ్, హిందీ, ఎకనామిక్స్‌, కెమిస్ట్రీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్, ఆర్ట్స్‌, ఫిజిక్స్‌, జువాలజీ, అగ్రికల్చర్‌, మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పీజీ, పీహెచ్‌డీ ఉత్తర్ణత, నెట్/ స్లెట్‌/ సెట్‌ స్కోరుతో పాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

వయసు:

జీతం: నెలకు ప్రొఫెసర్ పోస్టుకు రూ.1,44,200; అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 1,31,400; అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌కు రూ.57,700.

దరఖాస్తు రుసుము: రూ.1,000. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం:  విద్యార్హతలు, దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు NCERT వెబ్‌సైట్ www.ncert.nic.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర మార్గాలలో చేసిన దరఖాస్తులను ఆమోదించడం జరుగదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:  16-08-2024

వెబ్‌సైట్‌:

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel