రెండు రోజుల క్రితం బాలీవుడ్ మోడల్ పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు అన్న వార్త సంచలనం అయింది. కేవలం 35 సంవత్సరాల వయసులో అరుదైన “గర్భాశయ క్యాన్సర్” కారణంగా మరణించింది అన్న వార్త మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది .. టీవీల్లో స్క్రోలింగ్ లు, గర్భాశయ క్యాన్సర్ ఎలా వస్తుంది.. చికిత్స .. నివారణ .. లపై చర్చలు సోషల్ మీడియాల్లో వివిధ ఛానళ్లలో ప్రచురించారు.. న్యూస్ పేపర్లలో గర్భాశయ క్యాన్సర్ పై అనేక శీర్షికలు, వ్యాసాలు వచ్చాయి (తెలుగు దినపత్రికలలో కూడా)..
ఈ వార్త శుక్రవారంనాడు ఆమె సోషల్ మీడియా అకౌంట్ (ఇంస్టాగ్రామ్) లో ఆమె టీం ప్రచురించినట్లుగా వచ్చింది.. ఆ పోస్ట్ పూనమ్ పాండే “ధైర్యంగా వ్యాధితో పోరాడారు” మరియు మరణించారు – అని చెప్పింది.. దీనితో చివరికి రోజంతా ట్విటర్ లో కూడా ట్రెండింగ్ గా నిలిచింది. ఆమె స్పష్టమైన మరణాన్ని ప్రతిబింబించేలా ఆమె వికీపీడియా పేజీ కూడా నవీకరించబడింది, అలాగే బాలీవుడ్ తారలు కూడా ఆమెకు నివాళులర్పించారు.
తీరా చూస్తే శనివారం నాడు ఆమె ఇదంతా తూచ్ అని స్వయంగా ప్రకటించింది. దీనితో ఆమె ఆన్‌లైన్ లో అనేక విమర్శలను ఎదుర్కొంది, చాలామంది “మోసపూరిత స్టంట్” అని తీవ్రంగా నిందించారు.
ఇంతకూ ఆమె చెప్పింది ఏంటంటే ..
“అవును, నేను చనిపోయినట్లు తప్పుగా చెప్పాను.. కావాలనే ఇదంతా చేసాను.గర్భాశయ క్యాన్సర్ అవగాహన ప్రచారంలో భాగంగా అలా చెప్పాను. నేను అలా చెప్పడం వల్ల అకస్మాత్తుగా మనమందరం గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము, కదా? నా మరణ వార్త ఇలాంటి విజయాన్ని సాధించగలిగినందుకు నేను గర్వపడుతున్నాను.”అని అంది.
#PoonamPandey raised awareness about 3 important things:
1) Cervical cancer
2) The laundry of death – When some is (presumed) dead, everyone will say good things about them. Stuff they never do when the person is alive.
3) The fall of mainstream media – They’ll publish anything…— Ramesh Srivats (@rameshsrivats) February 3, 2024