దేశంలో మోడీ హవాకు బ్రేక్ .. బిజెపికి తిరోగమన మార్గం తప్పదా?

దేశంలో మోడీ హవాకు బ్రేక్ .. బిజెపికి తిరోగమన మార్గం తప్పదా?

లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తిరిగి పుంజుకున్న నేపథ్యంలో భవిష్యత్ లో బిజెపికి కష్టాలు తప్పకపోవచ్చు. సంకీర్ణ కూటమి గా ఏర్పడ్డ బిజెపి సర్కారు తిరిగి దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలానికి నడిపించబోతోంది.. ఇకపై బిజెపి భారత దేశానికి తమ పార్టీ ప్రతినిధి అనే ప్రచారాన్ని ముగించబోతోంది … 

కొన్ని ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే సర్కారు కొలువు తీరబోతోంది. మునుపటిలా బిజెపి దూకుడుగా వెళ్లే అవకాశం ఖచ్చితంగా లేదు. తమను వ్యతిరేకించే వారి మీద దాడులు చేసే అవకాశం లేదు. దీనితో ప్రతిపక్షాల విమర్శల జోరు, ఉద్యమాలు పెరిగే అవకాశం ఉంది. ఇది బిజెపికి ఎదురు దెబ్బే. 
ఇంతకాలం ఘనమైన మెజార్టీని అడ్డు పెట్టుకుని మీడియాను, పార్టీలను తమ గుప్పెట్లో పెట్టుకున్న బిజెపి ఇకపై తగ్గి ఉండక తప్పదు. అంతే కాదు మైనారిటీలపై దాడులు, హిందూ ఎజెండా లను ప్రక్కన పెట్టడం తప్పని పని కావచ్చు. 
దేశంలోనే అతి పెద్దదైన ఉత్తర ప్రదేశ్ లో బిజెపి మరింత దిగజారవచ్చు. ముందు ముందు బిజెపి పలుకుబడి తగ్గి ప్రజల్లో చులకన అయ్యే అవకాశం ఉంది. అంటే కాదు మోడీ హవా ఇక ముందు కొనసాగే అవకాశం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూటమి పెద్దల ఆమోదం పొందాల్సి ఉంది. 
దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు తప్పకుండా కేంద్రంలో చక్రం తిప్పుతారు. మరోవైపు నితీష్ కుమార్ కోసం తెలిసిందే తన మాట నెగ్గడం కోసం ఎంతకైనా తెగిస్తాడు. 
వీళ్లందరితో మరో ఐదేళ్లు ఈ సర్కార్ ఎలా కొనసాగుతుందో చూడాలి మరి. 

1 thought on “దేశంలో మోడీ హవాకు బ్రేక్ .. బిజెపికి తిరోగమన మార్గం తప్పదా?”

  1. ఒక సంకీర్ణప్రభుత్వాన్ని నడపటం కత్తిమీద సామే. అది బీజేపీకి ఐనా కాంగ్రెసుకు ఐనా అంతే. తమకన్నా మిత్రుల బలగం చాలా హెచ్చుగా ఉన్న సంకీర్ణప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి నడపటం మరింత కష్టం. ఇది ఏపార్టీని ఉద్దేశించి చెబుతున్నదీ అర్ధం ఐనది అనుకుంటాను. అందుచేత ఇప్పుడు బీజేపీకి కష్టం – రేపు కాంగ్రెసు వచ్చేస్తుంది అని లెక్కలు వేయటం అమాయకత్వం అనిపించుకుంటుంది.

Comments are closed.

Join WhatsApp Channel