Arvind Kejriwal: కేజ్రీవాల్ హత్యకు బిజెపి కుట్ర పన్నుతోంది : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ హత్యకు బిజెపి కుట్ర పన్నుతోంది : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. “కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై బీజేపీ గగ్గోలు పెడుతోంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ మెడికల్ రిపోర్టులో పేర్కొన్నట్లు” తెలిపారు.

“మొదట్లో, కేజ్రీవాల్ స్వీట్లు తినడం ద్వారా చక్కెర స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారని బిజెపి చెప్పింది. ఇప్పుడు కేజ్రీవాల్ సరిగా
భోజనం చేయడం లేదని వాపోతున్నారు. ఈ అంశాలన్నింటినీ చూస్తుంటే కేజ్రీవాల్‌కు బెదిరింపులు వస్తున్నట్లు స్పష్టమవుతోందని సింగ్ అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ వైద్యుల సూచన మేరకు మందులు, ఆహారం తీసుకోవడం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఆరోపించారు.

కేజ్రీవాల్ ఆరోగ్యానికి సంబంధించి జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు సక్సేనా లేఖ రాశారు. కేజ్రీవాల్‌కు ఇంట్లో వండిన ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను సంజయ్ సింగ్ ఖండించారు.

Join WhatsApp Channel