‘ఇండియాటుడే’ టాప్ 20 శక్తిమంతుడైన రాజకీయనాయకుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 5 వ స్థానాన్ని సంపాదించారు. ప్రతీ ఏటా లాగే 2024 సంవత్సరానికి సంబంధించి అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితాను జాతీయ మీడియా సంస్థ ‘ఇండియాటుడే’ ఇటీవల ప్రకటించింది.
ఈ జాబితాలో టాప్ 20 రాజకీయవేత్తలను కూడా ప్రకటించింది ఈ సంస్థ. ఆ లిస్ట్ ప్రకారం తొలి స్థానంలో ప్రధాని మోదీ, రెండవ స్థానంలో ఆర్‌ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, 3 వ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, 4వ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత-లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నారు. ఇక తరువాతి స్థానాలు చూస్తే 6 వ స్థానంలో బిహార్ సీఎంలు నితీశ్‌కుమార్, 7వ స్థానంలో యోగి ఆదిత్యనాథ్, 8 వ స్థానంలో తమిళనాడు సీయం ఎంకే స్టాలిన్, 9 వ స్థానంలో మమతా బెనర్జీ, 10 వ స్థానంలో సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఉన్నారు.
ఇక సీయం చంద్రబాబు నాయుడు కోసం వివరిస్తూ .. ‘లోక్‌సభలో టీడీపీకి ఉన్న 16 మంది ఎంపీలను మినహాయిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లో పడిపోతుంది. మెజారిటీ మార్కుకు దూరమవుతుంది. దీంతో పాలక ఎన్‌డీఏలో చంద్రబాబు పట్టు పెరిగింది. నాలుగోసారి సీఎం అయిన ఆయన.. తన చిరకాల స్వప్నమైన స్వర్ణాంధ్ర సాధన, రాజధాని అమరావతి నిర్మాణం లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది,. కార్పొరేట్లకు మిత్రుడిగా ఉండే చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్రానికి రెండోసారి సీఎం అయినప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజనెస్ (ఐఎ్‌సబీ) ఏర్పాటుకు చొరవ చూపారు. ఇటీవల విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరించారు. 15 శాతం వృద్ధి రేటుతో 2047కల్లా ఆంధ్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్లకు, తలసరి ఆదాయాన్ని 43 వేల డాలర్లకు తీసుకెళ్లడం ఆయన లక్ష్యం. ప్రజల భాగస్వామ్యం ఉండే వ్యూహాన్ని అభివృద్ధి చేసే విజన్ కావాలని ఆయన ఎప్పుడూ అంటుంటారు’ అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.