Prachi Singh IPS: యూపీలో నేరస్తులకు సింహస్వప్నం అయిన మహిళా ఐపీఎస్ ప్రాచీ సింగ్ ఎవరో తెలుసా?

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని చురుకైన, ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్లలో ప్రాచీ సింగ్ ఒకరు. నేరస్తులు, గూండాలే కాదు.. పోలీస్ శాఖలోని అవినీతిపరులు కూడా ప్రాచీ సింగ్ అంటే గజ గజ వణుకుతారు.

నిజానికి ప్రాచీ సింగ్ ఒక మహిళా ఐపీఎస్ అధికారి

అవును ప్రాచీ సింగ్ ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు చెందిన 2017 బ్యాచ్ అధికారి ప్రాచీ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌కు చెందినవారు. తండ్రి పీసీఎస్ అధికారి కావడంతో ఇంట్లో చదువుకు అనుకూల వాతావరణం ఉండేది. పాఠశాల విద్య తర్వాత ఆమె అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి LLB చదివారు. తర్వాత, ప్రాచీ సింగ్ భోపాల్‌లోని నేషనల్ లా యూనివర్శిటీ నుండి LLM పూర్తి చేసారు. అదే సమయంలో సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యారు. 2017లో తొలి ప్రయత్నంలోనే 154వ ర్యాంక్‌తో ఐపీఎస్‌గా మారిన ప్రాచీకి పారాగ్లైడింగ్, గుర్రపు స్వారీ, వార్తాపత్రికలు చదవడం అన్నా చాలా ఇష్టం.

ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌లో చేరినప్పటి నుండి, ఆమె మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారు. చాలా శక్తివంతమైన మరియు డైనమిక్ యువ IPS గా, ఆమె ఉత్తర ప్రదేశ్ కేడర్‌లో గుర్తింపు పొందిది. లక్నోలో ఆమె పనిచేసిన సమయంలో అక్కడ క్రైమ్ రేటు గణనీయంగా తగ్గింది, ఆ సమయంలో లక్నోలోని స్పాలు మరియు మసాజ్ సెంటర్‌లపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.

ఆమె ధైర్యసాహశాలను గుర్తించిన యోగి ప్రభుత్వం ఆమెను. క్రొత్తగా విభజింపబడ్డ శ్రావస్తి జిల్లాకు ఆమె మొదటి మహిళా పోలీసు సూపరింటెండెంట్‌ గా నియమించింది.

ప్రాచీ సింగ్ జిల్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సామాన్యులకు సత్వర న్యాయం అందించడం, ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన, నాణ్యమైన పద్ధతిలో పరిష్కరించడంతోపాటు నేరగాళ్లకు ఉచ్చు బిగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీస్ స్టేషన్లలో పార్క్ చేసిన వాహనాలను పారవేయడానికి ఆపరేషన్ క్లీన్, మరణించిన హిస్టరీ-షీటర్ల బ్లూప్రింట్లను ధ్వంసం చేయడానికి ఆపరేషన్ సఫాయా, హిస్టరీ షీటర్ నేరస్థుల ఆన్‌లైన్ జాతకాన్ని సిద్ధం చేసేందుకు ఆపరేషన్ బ్రహ్మాస్త్రం, ప్రజల సహకారంతో కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆపరేషన్ త్రినేత్ర, దీర్ఘకాలంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు, కోర్టులో నిందితుల కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఆపరేషన్ దర్పకడ్. ఆపరేషన్ కన్వెన్షన్‌, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడానికి ఆపరేషన్ సుదర్శన్, సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి ఆపరేషన్ కవాచ్ లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు.

శ్రావస్తి  జిల్లా శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు నేరగాళ్లలో పోలీసులంటే భయాన్ని నింపినందుకు గాను ఎస్పీ ప్రాచీ సింగ్‌కు ఈ సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా పోలీసు డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ బంగారు పతకాన్ని అందించారు.

ఒక మహిళ అయిఉండి ఇంతటి సమర్ధంగా అనేక బాధ్యతలను నిర్వర్తించి అశేష గుర్తింపు తెచ్చుకుంటున్న ఈమెను అందరూ అభినందించాలి. ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం!

Join WhatsApp Channel