పోలింగ్ నాడు రిజర్వులో ఉండే 15 శాతం ఈవీఎంలను టాంపరింగ్ చేసే అవకాశాలు
ఉన్నాయని తెలంగాణ సీఎం ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో
ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలను అటూ ఇటూ మారిస్తే తెలిసే అవకాశమే
ఉండదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదేండ్లకోసారి అధికార మార్పిడి
జరిగే ధోరణి నెలకొందన్నారు. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్
జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పారు.
తెలంగాణలో పదేండ్లకోసారి అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందన్నారు.
2029 వరకూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు.