వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి షర్మిలతో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఆస్తిగా భావిస్తున్నట్టు చెప్పారు. షర్మిలతో కలిసి కాంగ్రెస్‌లో పనిచేయడం సంతోషకరమైన విషయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌కు ఉన్న గౌరవం ఆయన కుమార్తె షర్మిలకు కూడా ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ఓటర్లేనని కోమటిరెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌కు ఉన్న గౌరవం షర్మిలకు కూడా ఉంటుంది: ఎంపీ కోమటిరెడ్డి
Share this Article