గంగానది స్వచ్చతపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ధాకరే తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, దేశంలో ఏ నదీ కూడా శుబ్రంగా లేదని.. దీనికి కారణం ప్రజలు, ప్రభుత్వాలేనని నొక్కి చెప్పారు.
మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) 19వ వార్షికోత్సవం సందర్భంలో చించ్‌వాడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, “మా నాయకుడు ఒకరు మహాకుంభ్ నుంచి తెచ్చిన గంగా జలాలను నన్ను త్రాగమన్నారు.. డానికి నేను నిరాకరించాను.. సోషల్ మీడియాలో స్త్రీలు మరియు పురుషులు తమ శరీరాలను రుద్దుకుంటున్న వీడియోలను నేను చూస్తున్నాను. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి ఆ జలాలను ఎవరు తాగుతారు?” అని రాజ్ థాకరే ఎగతాళి చేశారు.
“రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి గంగానదిని శుద్ది చేస్తాం అనే మాట వింటున్నాం.. అసలు నదులను మాతృమూర్తిగా భావించే ఈ దేశంలో ఒక్క నదైనా పరిశుభ్రంగా ఉందా? విదేశాల్లో చూడండి.. అక్కడ నదులను తల్లిగా భావించరు.. అయినా అక్కడి నదులు ఏడాది పొడుగునా ఏంతో స్వచ్చంగా ఉంటాయి. ఇక్కడి నదులలో బట్టలు ఉతుకుతారు..స్నానాలు చేస్తారు” అన్నారాయన.
అయితే, ఎప్పుడూ ఉప్పూ నిప్పుగా ఉండే శివసేన మరో వర్గం శివసేన (యుబిటి) ఉప నాయకురాలు సుష్మా అంధారే, రాజ్ ధాకరే ఈ వ్యాఖ్యలను మాత్రం సమర్ధించడం గమనార్హం!
"Despite calling our rivers 'mother,' we fail to keep them clean": Raj Thackeray raises issues of pollution in Ganga
— ANI Digital (@ani_digital) March 9, 2025
Read @ANI Story | https://t.co/SZOu6g3bzv#RajThackeray #Ganga #Mother pic.twitter.com/fOtKh9Eu8K