Vivo V40: భారత్ లోకి రాబోతున్న అతి పల్చటి ఫోన్ .. వామ్మో ఇన్ని ఫీచర్లా!

దేశంలో రెండవ అతిపెద్ద మార్కెట్ కలిగిన వివో, తన సరిక్రొత్త ఫోన్ Vivo V40 ని వచ్చే నెలలో విడుదల చేయబోతోంది. తన క్రొత్త మోడళ్ళు అయిన V40 and V40 Pro లను ఆగస్టులో విడుదల చేయబోతున్నామని ఇటీవల ప్రకటించింది. యూరప్ మార్కెట్ లో ఇప్పటికే విడుదల అయిన ఈ ఫోన్ అనేక ఫీచర్లతో దూసుకుపోతోంది. అవేంటో చూద్దాం ఇప్పుడు!

ఈ శ్రేణిలో అతి పలుచన అయిన ఫోన్ ఇది. 5,500mAh బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ యూరోప్ మోడల్ లాగానే ఉండబోతోంది అని కంపెనీ ఇటీవలే ప్రకటించింది. లోటస్ పర్పుల్, గంగా నీలం, టైటానియం మరియు గ్రే కలర్స్ లో అమలులోకి రాబోతుండగా గంగా నీలం అనేది క్రొత్తగా ఆకర్షణీయంగా ఉండబోతోంది.

vivo-v40
vivo-v40

ఈ ఫోన్ 6.78 inches (17.22 cm) 3D కర్వ్డ్ డిస్ప్లే తో ఉంది అందరూ కోరుకునే Qualcomm Snapdragon 7 Gen 3 ప్రొసెసర్, 8జిబి RAM ఈ ఫోన్ సరిక్రొత్త ఆండ్రాయిడ్ 14 వర్షన్ మాత్రమే కాక ఫన్ టచ్ UI కలిగి ఉంది.

ఇంటర్నల్ మెమరీ 256 GB అంటే మాటలా .. ఇప్పటికే అదుర్స్ అనిపించడం లేదూ ?!

కెమెరా విషయానికి వస్తే ముందు వైపున రెండు , వెనకా కూడా 50 మెగా పిక్సెల్ కావడం చాలా అద్భుతం అనే చెప్పాలి.

ఫుల్ హెచ్ డీ వీడియోలను చూపగలిగే ఈ ఫోన్ 5500mah బ్యాటరీ తో అత్యధిక వేగంతో చార్జ్ అయ్యే 80 వాట్ చార్జర్ సాకెట్ తో నిరంతరాయం ఆగకుండా వీడియోలను చూపగలదు.

5G టెక్నాలజీతో డ్యూయల్ సిమ్ లతో, బ్లూటూత్ v5.4, 5GHz వైఫై, లైట్, ప్రోక్షిమిటీ, కాంపాస్, గైరఒ స్కోప్, యాక్సెలరో మీటర్ లాంటి సెన్సార్లు కలిగిన ఈ ఫోన్ కోసం కొద్ది రోజులు ఆగడం నష్టం ఏమీ కాదు అంటున్నారు నిపుణులు.

ఇక ధర విషయానికి వస్తే ఇన్ని ఫీచర్లు కలిగిన ఫోన్లు రూ.60000 పైగానే ఉండగా వివో మాత్రం రూ.50000 నుంచి రూ.54000 మధ్యలో ఉంచబోతోంది. ఇదే మీ అయి, దగ్గరలో ఫోన్ కొనే వారైతే కొద్ది రోజులు వెయిట్ చేయడం తప్పు కాదేమో మరి.

Join WhatsApp Channel