Hasan Ali: భారత్ ఆడకపోతే క్రికెట్ ఏమీ ఆగిపోదు .. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్య

2025 ఛాంపియన్స్ ట్రోఫీని తమ సొంతగడ్డపై ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ టోర్నీ కోసం పాక్  వచ్చేందుకు టీమ్ ఇండియా అంగీకరించకుంటే క్రికెట్ ఏమీ ఆగిపోదు అని పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ సంచలన వ్యాఖ్య చేశాడు. 

Hasan Ali: భారత్ ఆడకపోతే క్రికెట్ ఏమీ ఆగిపోదు .. పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్య

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ మాత్రమే ఆతిథ్యమివ్వడంతో, భారత్ భాగస్వామ్యానికి సంబంధించి వివాదం నెలకొంది. బిసిసిఐ, తమ జట్టు పాకిస్తాన్ లో కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లేదా శ్రీలంకలో తమ పోటీలను నిర్వహించమని చేసిన సూచనకు ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఒకవేళ భారత్ సూచనకు మిగతా దేశాల బోర్డులు, ఐసీసీ అంగీకరించని పక్షంలో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడడం అనుమానాస్పదమే. 

అయితే పాకిస్తాన్ వార్తా చానల్ సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హసన్ అలీ మాట్లాడుతూ .. మెజారిటీ భారత్ ఆడగాళ్ళు పాకిస్తాన్ లో ఆడటానికి సిద్దంగా ఉన్నారని .. కాబట్టి జట్టు అభిప్రాయాలను బీసీసీఐ పరిగణలోకి  తీసుకోవాలని అన్నాడు . 

అయినా భారత్ ఆడనంత మాత్రాన టోర్నీ ఆగిపోదని .. క్రికెట్ ముగిసినట్లు కాదు అంటూ వ్యాఖ్యానించాడు. 

ఈ వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2023లో, పాకిస్తాన్ ఆతిథ్యమిచ్చినప్పటికీ, భారతదేశం తమ అన్ని ఆటలను శ్రీలంకలో ఆడింది. అయితే, ఆ సంవత్సరం తరువాత, పాకిస్తాన్ జట్టు  ప్రపంచ కప్-2023 కోసం ఇండియాకు వచ్చింది. 

భారత్ చివరిసారిగా 2008 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌లో పర్యటించింది, అదే వారు ఆతిథ్యమిచ్చిన చివరి ICC టోర్నమెంట్ కూడా.

గత 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇరు దేశాలు తలపడగా, అక్కడ పాకిస్థాన్ ఛాంపియన్‌గా అవతరించింది. హసన్ అలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు లభించింది.

Join WhatsApp Channel