2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఈరోజు జరిగిన హాకీ మ్యాచ్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ను 4-2 స్కోర్ తో ఓడించిన ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది.
ఒలింపిక్స్‌లో హాకీలో వరుసగా రెండో పతకానికి భారత్ మరో గెలుపు దూరంలో ఉంది. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది మన టీం.
ఈరోజు గ్రేట్ బ్రిటన్ తో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. దాదాపు 43 నిమిషాలపాటు అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ అత్యద్భుత ప్రదర్శన కనపర్చింది.
మొదటగా మ్యాచ్ 1-1తో టై కాగా షూటౌట్‌లో భారత్ 4-2తో గెలుపొందింది. తొలి అర్ధ మ్యాచ్ లో ఇరుజట్లు గోల్స్ ఏమీ చేయలేదు. రెండో అర్ధం ఆరంభమైన కాసేపటికే హాకీ స్టిక్‌తో బ్రిటన్ ఆటగాడి తలపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడని భావించిన రిఫరీలు భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ కు రెడ్‌కార్డ్ ఇచ్చి బయటకు పంపారు. దీనితో 10 మంది తోనే భారత్ ఆడాల్సి వచ్చింది.
అయితే, 22వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. కీనీ బ్రిటన్ తరపున 27వ నిమిషంలో మోర్టన్ లీ గోల్ చేయడంతో స్కోర్ 1-1 తో సమం అయింది. ఆ తర్వాత ఇరు జట్లూ గోల్స్ చేయలేక పోయాయి. దీంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది.
భారత్ సెమీ-ఫైనల్ పోరులో అర్జెంటీనా లేదా జర్మనీతో తలపడబోతోంది. అంతకుముందు బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఇండియన్ హాకీ జట్టు ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై విజయం 52 ఏళ్ల తర్వాత తొలిసారి.
What a GAME . Boys #hockey#India #TeamIndia pic.twitter.com/4JXD9bG1GK
— AR 🦅 (@sayyed_ar3) August 4, 2024