INDvsSL T20I: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా భారత్‌ .. రాత్రి 7 గంటలకు మ్యాచ్

కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల నేతృత్వంలోని టీమ్ ఇండియా మూడు టీ20ల సిరీస్‌లో 2-0తో అజేయంగా ఆధిక్యంలో ఉంది. మంగళవారం జరిగే మూడో, చివరి మ్యాచ్‌లోనూ శ్రీలంకను చిత్తు చేసి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు వేస్తోంది.

INDvsSL T20I: సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా భారత్‌ .. రాత్రి 7 గంటలకు మ్యాచ్

స్వదేశంలో ఘోర ఓటమిని తప్పించుకొనేందుకు శ్రీలంక తంటాలు పడుతోంది. ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి లను తట్టుకోడానికి ఈ మ్యాచ్ గెగ్గితేనే ఒక బూస్ట్ లభిస్తుంది.

తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్.. ఆదివారం వర్షం అంతరాయం కలిగించిన రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక జట్టు ఆరంభంలో అదరగొట్టినా ఆ తర్వాత ఆ జట్టు మిడిల్ ఓవర్లలో కుప్పకూలింది.

సరైన ప్రణాళిక, ఒత్తిడిని ఎదుర్కోవడంలో టీమ్ ఇండియా మంచి పరిణితి సాధించింది. జట్టు దూకుడుగా ఆడాలని నిర్ణయించినట్లు కెప్టెన్ సూర్య చెప్పాడు. సూర్య కెప్టెన్సీ వినూత్నంగా ఉంది. బ్యాటింగ్‌లోనూ 58, 26 పరుగులు చేశాడు.

మెడ నొప్పి కారణంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో మ్యాచ్‌లో ఆడలేదు. అతను మూడో మ్యాచ్ కు కూడా అందుబాటులోకి రాలేడనే అనిపిస్తోంది. అయితే అతని స్థానంలో అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్ ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. మరోవైపు మరో ఓపెనర్ యస్సావి జైస్వాల్ రాణిస్తున్నాడు.

లంక తరఫున పాతుమ్ నిశాంక (111 పరుగులు), కుశాల్ పెరీరా (73) దూకుడుగా ఆడినా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం జట్టుకి టెన్షన్ తెప్పిస్తోంది. బౌలింగ్ లో కూడా అంతగా రాణించ లేకపోతోంది.

చూడాలి మరి ఈరోజు మ్యాచ్ కూడా వన్ సైడ్ గా సాగుతుందో .. లేదో ..

మ్యాచ్ ప్రారంభం: 7.00 PM

లైవ్ స్ట్రీమింగ్: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్

Join WhatsApp Channel