BRS MLA Lasya Nanditha Died: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!

BRS MLA Lasya Nanditha Died: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి!

బీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్‌ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ పరిస్థితి కూడా విషమంగా ఉంది.

ఇటీవలే ఆమెకు వరుస ప్రమాధాలు సంభవించాయి. గత నెల ఆమె ఒక లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడం, అలాగే పదిరోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురికావడం లాంటి సంఘటనల్లో బయట పడినా ఈరోజు ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అందరి మనసుల్లో విషాదాన్ని నింపింది.

రాజకీయాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న యువ మహిళా నేత కన్నుమూయడం పట్ల స్థానికులు, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు.

A XL 6 Car Collasped At Patencheru ORR.
Car Hit Divider
Contonment BRS Mla lasya Nandita was Traveling In The Car. Where Lasya Died on Spot
Driver Seriously injured shifted to Hospital @BRSpartypic.twitter.com/ncX89rgJZq

— Dilip kumar Choudhary (@PDilip007) February 23, 2024

Join WhatsApp Channel