కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అధికార లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. “పార్టీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత నేను పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాను” అని 53 ఏళ్ల ఒట్టావాలో సోమవారం విలేకరుల సమావేశంలో విలేకరులతో అన్నారు.
కొత్త నాయకుడిని ఎన్నుకునేంత వరకు (మార్చి 24 వరకు) దేశ పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ట్రూడో ప్రధానమంత్రిగా కేర్ టేకర్ హోదాలో కొనసాగుతారు.