Bank Holidays in August: ఆగస్టులో బ్యాంకులకు సెలవులే సెలవులు.. లిస్ట్ ఇదిగో

ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ హాలిడే క్యాలెండర్ ప్రకారం మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఆర్‌బీఐ ప్రకటించిన ఈ లిస్ట్ లో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ హాలీడేస్ కలిపి ఉన్నాయి.

bank-holidays-in-august
bank-holidays-in-august

ఈ లిస్ట్ ప్రకారం ..

ఆగస్టు 3: కేర్ పూజ – అగర్తల రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 4: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 8: టెన్డాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కిం
ఆగస్టు 10: రెండో శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 11: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగష్టు 13: పేట్రియాట్ డే (ఇంఫాల్)
ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 18: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 19: రక్షా బంధన్/రాఖీ – దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
ఆగష్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, తిరువనంతపురం)
ఆగస్ట్ 24: నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 25: ఆదివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 26: జన్మాష్టమి – దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

వినియోగదారులు ఈ సెలవులను బట్టి తమ లావాదేవీలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సెలవులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక జాబితాల ప్రకారం మార్పులు, చేర్పులు జరగ వచ్చు అని ఆర్బీఐ తెలిపింది .

Join WhatsApp Channel