Chicken: ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌ లో ఇది అస్సలు తినకండి

 

Chicken: ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్‌ లో ఇది అస్సలు తినకండి

మాంసాహారం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్.. పండగలయినా, చుట్టాలు వచ్చినా, సెలవుల్లో అయినా చికెన్ వండేసుకోవడం మనోళ్ల అలవాటు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చికెన్ వాసన చూసారంటే ఇంక వేరే కూర తినలేరు. 

అయితే చికెన్ ను ఎంత బాగా వండినా ఈ భాగం ఉంటే మాత్రం మీ ఆరోగ్యానికి ఖచ్చితంగా హాని
కలిగిస్తుంది అంటున్నారు పరిశోధకులు. 

ఆ తినకూడని భాగం స్కిన్ (చర్మం). సాధారణంగా చాలామంది స్కిన్ తో చికెన్ తింటే రుచిగా ఉంటుంది అని స్కిన్ తోనే తెచ్చుకుంటారు. అటువంటి వాళ్ళకు ముప్పు పొంచి ఉంది. 

చికెన్ స్కిన్‌లో ఏముంటుంది?

చికెన్
స్కిన్‌లో టన్నుల కొద్దీ కొవ్వు మరియు చెడు కొలెస్ట్రాల్ ఉంటాయి. ఇందులో
పోషక పదార్ధాలు కూడా లేవు, కాబట్టి ఇది చికెన్‌లో చాలా పనికిరాని భాగం. 

 ఇంకా చెప్పాలి అంటే కోడి చూస్తే అందంగా కనిపించాలి అని స్కిన్ మీద కొన్ని రకాల రసాయనాలు కూడా పూస్తుంటారు షాప్ వాళ్ళు. 

USDA పరిశోధన  ప్రకారం,  ఒక కప్పు వండిన స్కిన్ లెస్ చికెన్‌లో 231 కేలరీలు ఉంటాయి,
అదే స్కిన్ తో వండిన కప్పులో 276 కేలరీలు ఉంటాయి. ప్రతి ఔన్స్‌ స్కిన్ ఉన్న చికెన్ మాంసంలో, ప్రతి
కప్పులో 3 గ్రాముల చెడు కొవ్వు ఉంటుంది. 

కనుక స్కిన్ లెస్ చికెన్ అదీ కొవ్వు తక్కువగా ఉండే చికెన్ తింటే అనారోగ్యాల బారి నుంచి కాస్త కాపాడుకోవచ్చు. 

Join WhatsApp Channel