ECIL Jobs: ఈసీఐఎల్‌లో 115 ఉద్యోగాలు … చివరి తేదీ ఆగస్టు 8

ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌), హైదరాబాద్‌లో అటామిక్‌ ఎనర్జీ విభాగంలో ఒక సంవత్సర కాలానికి ఒప్పంద ప్రాతిపదికన (వీలును బట్టి మరో మూడేళ్లు పొడిగించే అవకాశం ఉంది) వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ECIL Jobs
ECIL Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 115
పోస్టుల వివరాలు:

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–20
  • టెక్నికల్‌ ఆఫీసర్‌–53
  • జూనియర్‌ టెక్నీషియన్‌(గ్రేడ్‌–2)/జూనియర్‌ టెక్నీషియన్‌–42

విభాగాలు : అటామిక్‌ ఎనర్జీ విభాగం

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: పోస్టును అనుసరించి ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుకు 33 ఏళ్లు, టెక్నికల్‌ ఆఫీసర్‌కు, జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుకు రూ.40,000 నుంచి రూ.55,000, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ.25,000 నుంచి రూ.31,000, జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టులకు రూ.22,528 నుంచి రూ.27,258.

ఎంపిక విధానం:  విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెరిట్‌ లిస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.08.2024

వెబ్‌సైట్‌: https://www.ecil.co.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel