- సికింద్రాబాద్ జోన్ లో 590 ఖాళీలు.
- అప్లికేషన్ ప్రక్రియ మొదలైంది .. చివరి తేదీ ఆగస్టు 29.
RRB JE రిక్రూట్‌మెంట్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఒక భారీ ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 7951 డ్రైవ్ జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ధరఖాస్తు ప్రక్రియ జూలై 30, 2024 న మొదలైంది. చివరి తేదీ ఆగస్టు 29. వివరాల్లోకి వెళ్తే..
ఖాళీల వివరాలు:
కెమికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రీసెర్చ్: 17 పోస్టులు
జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్: 7934
మన సికింద్రాబాద్ జోన్ లో 590 ఖాళీలు ఉన్నాయి
విద్యార్హత
పోస్టుని బట్టి వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. వివరాలు నోటిఫికేషన్ లో చూడండి
వయోపరిమితి (01/01/25 నాటికి): 36 ఏళ్ల కు మించకూడదు. అయితే OBC(NCL), SC & ST వారికి గరిష్ట వయసులో ప్రత్యేక సడలింపు కలదు
జీతం
రూ.35,400/- నుండి రూ.44,900/- వరకు పోస్టును బట్టి ఉంటుంది.