ఈ నెల 2 తేదీన, కరాచీకి చెందిన అమీనా భారత్ కు చెందిన అర్బాజ్ ఖాన్ ఆన్లైన్ లో వివాహం చేసుకున్నారు.
జోధ్‌పూర్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అయిన అర్బాజ్ ఖాన్ మరియు కరాచీ వాసి అమీనా ల వివాహం బుధవారం నాడు నగరంలోని ఓస్వాల్ సమాజ్ భవన్‌లో తన స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో సోషల్ మీడియా వేదికగా జరిగింది. ఇది సాధారణ వివాహంలాగా ఒక వేడుకలా సాగింది. ఇరు వేదికల్లో హాజరైన అనేక మంది ఈ దంపతులను ఆశీర్వదించారు.
పెళ్ళికొడుకు అర్బాజ్ బుధవారం వేడుక తర్వాత మాట్లాడుతూ, అమీనా వీసా కోసం దరఖాస్తు చేసుకుంది అని, ఆ వీసా ఆలస్యం అవుతుండడంతో అనుకున్న ముహూర్తానికి ఇలా వివాహం జరిగింది అని చెప్పాడు. నేను పాకిస్తాన్ లో వివాహం చేసుకుంటే అది మన దేశంలో గుర్తించబడదు కనుక ఆమె భారత్ కి వచ్చాక మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు.
ఈ వివాహం ప్రేమ వివాహం కాదు అని, పెద్దలు నిర్ణయించిన పెళ్లి అని, ఇరు దేశాల సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి వచ్చింది అని అర్బాజ్ చెప్పాడు.
అమీనా త్వరలో వీసా పొంది భారత్‌కు వస్తుందని అతను ఆశిస్తున్నాడు.