ఇరాన్ అద్యక్షుడు ఇబ్రహీం రయీసీ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ఆచూకీ తెలిసింది. అయితే ప్రమాద ప్రదేశంలోని పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు అని ఇరాన్ కి చెందిన రెడ్ క్రెసెంట్ చీఫ్ ప్రకటించారు. ప్రెసిడెంట్ రైసీతో కలిసి హెలికాప్టర్‌లో సెయ్యద్
మొహమ్మద్-అలీ అల్-హషేమ్, తబ్రిజ్‌కు చెందిన జుమా , జమాత్ మరియు విదేశాంగ
మంత్రి హొస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ , ఇతరుల ఆచూకీ పై కాసేపట్లో కీలక సమాచారం రానుంది.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్‌బైజాన్ సరిహద్దులోని
డ్యామ్‌ను ప్రారంభించి ఇరాన్ కు తిరిగి వస్తుండగా ప్రావిన్స్ లోని జోల్ఫా సమీపంలోని మంచు పర్వతాల వద్ద హెలికాప్టర్
కుప్పకూలింది.ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రకారం.. అధ్యక్షుడు
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది
తరువాత అధ్యక్షుడు ?
ఈ ప్రమాదంలో అధ్యక్షుడికి ఏదైనా జరిగితే ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్
మహ్మద్ మోఖ్‌బర్‌ను నియమిస్తారని ఇరాన్ మీడియా చెబుతోంది. దీని తర్వాత మరో
50 రోజుల్లో కొత్త ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రమాదం
తర్వాత ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ ఉన్నత స్థాయి సమావేశాన్ని
పిలిచారు. అతను ప్రెసిడెంట్ రైసీ కోసం కూడా ప్రార్థించాడు. ఇరాన్ ప్రజలు
ఆందోళన చెందవద్దని, ఈ ప్రమాదం వల్ల ప్రభుత్వ పనికి ఎలాంటి నష్టం వాటిల్లదని
అన్నారు.
ప్రధాని మోడీ ఆందోళన
మరోవైపు ప్రమాదంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రెసిడెంట్ రైసీ హెలికాప్టర్‌కు సంబంధించి నేడు వచ్చిన నివేదికల పట్ల తాను
చాలా ఆందోళన చెందుతున్నానని ఆయన అన్నారు. ఈ సంక్షోభ సమయంలో మేము ఇరాన్
ప్రజలకు సంఘీభావంగా నిలుస్తాము. అధ్యక్షుడు, అతని సహచరుల శ్రేయస్సు కోసం
ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు.