Kamala Vs Trump Debate: మొదటి డిబేట్ లో ఎవరిది పైచేయి?!

కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్‌ ల మధ్య మంగళవారం రాత్రి జరిగిన మొదటి చర్చ దాదాపు 1 గంట 45 నిమిషాల పాటు వాడి వేడిగా సాగింది. ఒకరిపై మరొకరు మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.

ఈ డిబేట్ కోసం దాదాపు 5 రోజుల పాటు హారిస్ ప్రిపేర్ అయ్యారు.. ప్రపంచంలోని అనేక అంశాలు ఈ డిబేట్లో చర్చకు రాగా ప్రతీ అంశంలోనూ ట్రంప్‌ను రెచ్చగొట్టేలా ఆమె సమాధానాలు ఇచ్చారు. అయితే ట్రంప్‌ సంయమనం కోల్పోకుండా అంటే వేగంతో చూరకలంటించారు.

తాను మధ్య తరగతి నుంచి వచ్చానని అమెరికా ప్రజలను పైకి తీసుకెళ్లే ప్లాన్‌ ఇక్కడ నాకు మాత్రమే ఉంది… స్టార్టప్స్‌పై టాక్స్‌ను తగ్గించే ప్లాన్ నా దగ్గర ఉంది అని కమలా హారిస్ అన్నారు. దీనికి డొనాల్డ్ ట్రంప్, మన ఎకానమీ భయంకరంగా మారింది. ద్రవ్యోల్బణం పెరిగింది. చరిత్రలో ఇంత దారుణంగా ఎప్పుడూ లేదు. ఇది ప్రజలకు పెద్ద విపత్తు అని మండిపడ్డారు.

ట్రంప్ వెళ్లిపోతూ నిరుద్యోగాన్ని దేశంపై రుద్దారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం లోకి వెళ్లింది. ప్రజాస్వామ్యంపై దాడి చేశారు. ప్రాజెక్ట్ 2025 అనే ప్రమాదకరమైన ప్లాన్ ప్రజలపై రుద్దాలని ట్రంప్ యత్నిస్తున్నారు. అని హారిస్ అనగా.. అలాంటి ప్లాన్ ఏదీ లేదు. నేను తెరచిన పుస్తకాన్ని, నేను ఏం చేస్తానో ప్రజలకు తెలుసు అని ట్రంప్ అన్నారు. దీనికి ప్రతిగా ట్రంప్‌కి ఏ ప్లానూ లేదని కమలా హారిస్ అనడంతో.. హారిస్‌కి కూడా ప్లాన్ లేదనీ, ఆమె, బిడెన్‌ను కాపీ కొడుతోందని ట్రంప్ అన్నారు. కమలా హారిస్ ఒక మార్క్సిస్ట్ అన్న ట్రంప్.. ప్రమాదకరమైన పాలసీతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని టార్గెట్ చేశారు.

హారిస్ మాట్లాడేటప్పుడు ట్రంప్ మామూలుగానే ఉన్నారు, అయితే హారిస్ తన ముఖ కవళికలను మారుస్తూ ఉన్నారు. ఆమె కొన్ని ట్రంప్ వ్యాఖ్యలకు నవ్వింది, మరికొన్నిటికి ముసిముసిగా నవ్వింది, కొన్నింటికి తల విదిలించింది అలాగే కొన్నిసార్లు బిక్కమొహం కూడా వేసింది.

Join WhatsApp Channel