Telugu Girls Arrested in US: అమెరికాలో తెలుగు విద్యార్దినుల అరెస్ట్

గుంటూరు, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు తెలుగు విద్యార్దినులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని న్యూజెర్సీకి  ఉన్నత చదువుల కోసం వెళ్ళిన ఈ ఇద్దరినీ షాప్ దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. హైరాబాద్ కి చెందిన 20 ఏళ్ల అమ్మాయి, గుంటూరుకి చెందిన 22 ఏళ్ల అమ్మాయి పై చదువులకోసం అమెరికా వెళ్లారు. అక్కడ షాప్ రైట్ అనే మాల్  లో షాపింగ్ చేశారు. అయితే కారణం ఏదో తెలీదు కానీ వారు కొన్న కొన్ని వస్తువులకు బిల్ చెల్లించలేదు అనే కారణంతో షాప్ వారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వారికి చెప్పారు.

తమకు తెలీకుండా ఇది జరిగినది అని, ఆ వస్తువులకు రెట్టింపు ధర చెల్లిస్తాము అని, మళ్ళీ ఈ తప్పు చేయము అని వారు చెప్పినా పోలీసులు వినలేదు. చట్టాల ప్రకారం వారిని న్యాయస్థానం ముందు హాజరు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.

Join WhatsApp Channel