UK Election 2024: రిషి సునాక్ కు ఓటమి తప్పదా !! .. నేడే ఓటింగ్

UK Election 2024: రిషి సునాక్ కు ఓటమి తప్పదా !! .. నేడే ఓటింగ్

 బ్రిటన్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్‌ మొదలైంది. 650 పార్లమెంట్‌ స్థానాల్లో లేబర్‌, కన్జర్వేటివ్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. అయితే భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీకి ఈసారి ఓటమి తప్పదంటూ సర్వేలు చెబుతున్నాయి. 14 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్న లేబర్‌ పార్టీ ఈసారి పక్కాగా అధికారంలోకి వస్తుందంటూ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

14ఏళ్లుగా యూకేలో కన్జర్వేటివ్‌ పార్టీనే అధికారంలో ఉంది. కానీ వారు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పెద్దగా నెరవేర్చలేదు. ప్రపంచ ఆర్థిక
వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పుడు అధికారం చేపట్టిన కన్జర్వేటివ్‌ పార్టీ మరో
మూడు ఎన్నికల్లోనూ గెలిచింది. అయితే ఈ కాలంలో యూకే ఆర్థిక వ్యవస్థ
నెమ్మదించడం, వరుస కుంభకోణాల విమర్శలకు తావిచ్చాయి. మరోవైపు జీవన ప్రమాణాలు
చాలా కాస్టీగా మారడంతో కన్జర్వేటివ్‌ పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్‌(rishi sunak) నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ కి , ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్ (Keir Starmer) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 

బ్రిటన్‌లోని స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల
వరకు ఓటింగ్ కొనసాగనుంది. బ్రిటన్, ఇంగ్లండ్, నార్తర్న్ ఐర్లాండ్,
స్కాట్లాండ్, వేల్స్‌లోని అన్ని ప్రాంతాల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. 

Join WhatsApp Channel